V6 News

గడ్కరీ సంచలన కామెంట్స్ : ముస్లింలు ఓట్లేయకున్నా పర్వాలే..

గడ్కరీ సంచలన కామెంట్స్ : ముస్లింలు ఓట్లేయకున్నా పర్వాలే..

తాను పక్కా ఆర్ ఎస్ ఎస్ మనిషినన్న కేంద్ర మంత్రి

పీఎం రేసులో లేను, మోడీ వెనకే ఉంటానని ప్రకటన

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నాగ్ పూర్ స్థానం నుం చి 5 లక్షల ఓట్లతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తూనే తనకు ముస్లింలెవరూ ఓట్లేయకున్నా ఫర్వాలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శుక్రవారం  జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆయనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నూరు శాతం ఆర్ ఎస్ ఎస్ మనిషిని. 10 లక్షల మంది ముస్లింల మధ్య నిలబడినా ఇదే మాట చెబుతా. వాళ్లు నా కు ఓటేస్తే సంతోషం. వేయకున్నా పర్వాలేదు. ఇలా మా ట్లాడటం తప్పే కావచ్చు. కానీ నేను లెక్కలేసు కుని మా ట్లాడే రకం కాదు. బాధ్యతగల బీజేపీ కార్యకర్తగా దేశమే సుప్రీం అని భావిస్తా ’’అని గడ్కరీ చెప్పుకొచ్చారు.

పీఎం అయ్యేంత సీనా!

ప్రధానమంత్రి కావాలన్న కోరికగానీ, ఆ పీఠం ఎక్కడానికి అవసరమైన బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ గానీ, పబ్లిక్ రిలే షన్స్ తనకు లేవని గడ్కరీ అన్నారు. పీఎం పోస్టుకు మోడీకి ప్రత్యామ్నాయంగా తన పేరే ఎందుకు వినిపిస్తుందో తెలీదన్నారు. ‘‘కేంద్రం లో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది . మోడీనే మళ్లీ ప్రధాని అవుతారు. మంత్రులుగా తామంతా మోడీ వెనకే ఉంటాం. మేమే ఆయనను సమర్థిస్తుంటే ఇక ప్రధాని పదవికి పోటీ ఎక్కడిది?’’అని గడ్కరీ ప్రశ్నించారు. తనను కలవడానికి వచ్చేవాళ్లం దరితో పాజిటివ్ గా మాట్లాడుతానని. కష్టపడి పని చేస్తానని, బహుశా

ఈ లక్షణాల వల్లే పార్టీలకు అతీతంగా అందరూ తనను అభిమానిస్తుండొచ్చని గడ్కరీ అన్నారు. బీజేపీ నేతలు పదే పదే ప్రచారం చేసే ‘కాంగ్రెస్ ము క్త్ భారత్’ నినాదంపై గడ్కరీ భిన్నంగా స్పందించారు. సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష పార్టీలను ప్రత్యర్థులుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసేవాళ్లుగా ఉండటం కంటే ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగేందుకు యువత శ్రమించాలని గడ్కరీ సలహా ఇచ్చారు.