నిఖిల్ హీరోగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్‌లో వేగం పెంచుతూ ఆదివారం బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 11న టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో నిఖిల్ యాక్షన్ లుక్ ఇంప్రెస్ చేసింది.
ఇందులోని వారియర్ క్యారెక్టర్ కోసం అతను ఫిజికల్ మేకోవర్‌తో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ డీవోపీగా వర్క్ చేస్తుండగా ‘కేజీఎఫ్’ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్10న సినిమా విడుదల కానుంది.
