నత్తనడకన నిజామాబాద్ కార్పొరేషన్ యూజీడీ పనులు

నత్తనడకన నిజామాబాద్ కార్పొరేషన్ యూజీడీ పనులు
  •      నాలుగింతలైన  అంచనా వ్యయం
  •      రూ.94 కోట్ల నుంచి   రూ.232 కోట్లు వెచ్చింపు 
  •      ఇంకా రూ.85 కోట్లు కావాలంటా..!

నిజామాబాద్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్న అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ (యూజీడీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. 14 ఏళ్లుగా జరుగుతున్న ఈ పనుల అంచనా వ్యయాన్ని ఇప్పటికే నాలుగింతలు పెంచారు.. అయినా మరో రూ.85 కోట్లు కావాల్సిఉంది. ఈ నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారు..? పనులు ఎప్పుడు కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేస్తారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. 

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సి పాలిటీ 2005 మార్చి 5న కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. నగర అవసరాలకు తగ్గట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి 2007లో ప్రతిపాదనలు చేశారు. రూ.94 కోట్ల అంచనా వ్యయంతో 2008 మార్చి 24న కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పనులు అప్పగించారు. 24 నెలల్లో అంటే 2010 మార్చి 24 నాటికి పనులు పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే  బిల్లులు సక్రమంగా రాక 2012 మార్చి 31న కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  2015 నవంబర్ 20న టీఆర్ఎస్ ప్రభుత్వం యూజీడీ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.231 కోట్లు కేటాయించింది. 18 నెలల కాల పరిమితిలో పనులను పూర్తి చేయాలని ఒప్పందంతో మరో కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు. 2016 జూన్ 4న ప్రారంభించిన పనులు 2017 డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాలి.  పనులు పూర్తికాకపోవడంతో గడువును 2018 జూన్ 30 వరకు పొడిగించారు. కానీ అప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా నగరంలో ఇంటింటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. డ్రైన్ పైపుల పనితీరును పరిశీలించాల్సి ఉంది. ఇందు కోసం మరో రూ.85 కోట్లు అవసరమని పనులను పర్యవేక్షిస్తున్న పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపించారు. నిధులు ఇంకా మంజూరు కాకపోవడంతోనే పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పనుల్లో పర్సంటేజీలు?

అం డర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో పర్సంటేజీల గొడవలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంచనా వ్యయం రూ.94 కోట్ల నుంచి రూ.232 కోట్లకు పెరిగినా వాటాల పంపకాల్లో తేడాలు  రావడంతో పనులు అగినట్లు ప్రచారం జరుగుతోంది. పనుల పేరిట ప్రధాన ఇంటర్నల్ రోడ్లను ఇష్టారీతిన తవ్వేయడంతో ట్రాఫిక్ సమస్య 
తలెత్తుతోంది. రెండో దశలో ఇంటింటికీ డ్రెయిన్ కనెక్షన్ కోసం రోడ్లను మళ్లీ తవ్వాల్సి ఉంటుంది. రోడ్లు తవ్వడం వేయడం వల్ల రూ.వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.