V6 News

కొత్త రూల్.. పార్లమెంట్ లో ధర్నాలు, నిరసనలు నిషేధం

కొత్త రూల్.. పార్లమెంట్ లో ధర్నాలు, నిరసనలు నిషేధం

పార్లమెంట్ సమావేశాలో నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో ధర్నాలు, దీక్షలు, నిరసనలకు అనుమతి లేదంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ‘సభ్యులు ఎటువంటి ప్రదర్శనలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు లేదా ఏదైనా మతపరమైన వేడుకల కోసం పార్లమెంటు  ఆవరణను ఉపయోగించకూడదు.ఇందుకు సభ్యులు సహకరించాలని కోరుతున్నాము" అని బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  జైరాం రమేష్ ప్రభుత్వంపై ట్విటర్‌లో సెటైర్ వేశారు.  విశ్వగురు నుంచి మరో కొత్త రూల్ వచ్చింది. ఇకపై ధర్నాపై నిషేదం  అంటూ ట్వీట్ చేశారు.

 

ఇప్పటికే లోక్ సభ నిషేధిత పదాల లిస్ట్ ను రిలీజ్ చేసింది లోక్ సభ సెక్రటేరియట్.  ఈ మేరకు ఓ బుక్ లెట్ ను విడుదల చేసింది. అందులో సిగ్గులేదు, ధోకేబాజ్, అసమర్థుడు, నాటకం, నటన, అవినీతి పరుడులాంటి మరిన్ని పదాలను బుక్ లెట్ లో చేర్చింది.  కరప్ట్, కవర్డ్, హూలిగనిజం, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, క్రొకొడైల్‌ టియర్స్, బ్లడ్‌షెడ్, డాంకీ, డ్రామా, అప్‌మాన్, కాలా బజారీ, చంచా, చంచాగిరి, అబ్యూస్డ్, చీటెడ్, క్రిమినల్,  గూన్స్,  దలాల్, దాదాగిరీ, లాలీపాప్, వినాశ్‌ పురుష్, ఖలిస్తానీ,  బేహ్రీ సర్కారు, బాబ్‌కట్, జుమ్లాజీవీ, శకుని, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, ఐవాష్, అన్‌ట్రూ, కోవిడ్‌ స్ప్రెడర్, గిర్గిట్, బేచారా, అసత్య, అహంకార్ వంటి ఇంగ్లీషు పదాలను అందులో చేర్చారు.

ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. అన్ పార్లమెంటరీ పదాల పేదల పేరుతో తమ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతి పక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. సీనియర్ పార్లమెంట్ నేతలు జైరాం రమేశ్, డెరెక్ ఓబ్రెయిన్, రణ్ దీప్ సూర్జేవాలా, ప్రియాంక చతుర్వేది తదితరులు ఈ చర్యని తీవ్రంగా ఖండించారు. 

ప్రతిపక్ష ఎంపీలపై ఇప్పటికే కాగ్ ను ప్రయోగించిందన్న వారు... ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేసేందుకు... అసభ్య పదజాలం పేరుతో ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు కుట్రలు పన్నుతోందని ఫైర్ అయ్యారు. ప్రజల కోసం పోరాడేందుకు వచ్చే సమావేశాల్లో ఆ పదాలను ఉపయోగిస్తామని, వీలైతే తమను సభ నుంచి సస్పెండ్ చేయాలని సవాలు విసిరారు.