ఇండియన్ ఉసేన్ ​బోల్ట్‌కు ట్రయల్స్​ ఇప్పుడే కాదు!

ఇండియన్ ఉసేన్ ​బోల్ట్‌కు ట్రయల్స్​ ఇప్పుడే కాదు!

బెంగళూరు: కర్నాటక సంప్రదాయ క్రీడ కంబళ పోటీల్లో13.62 సెకన్లలో 145 మీటర్ల దూరం పరిగెత్తి ఓవర్​నైట్​ పాపులర్​ అయిన శ్రీనివాస​గౌడ సోమవారం బెంగళూరులోని స్పోర్ట్స్​అథారిటీ ఆఫ్​ఇండియా (సాయ్) కు చేరుకోనున్నాడు. అయితే, అతనికి వెంటనే ట్రయల్స్​ నిర్వహించడం లేదని, ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడిన తర్వాతే పరీక్ష పెడతామని సాయ్​ వర్గాలు తెలిపాయి. ట్రయల్స్​ తేదీని ప్రకటించాల్సి ఉంది. దాంతో,  స్ప్రింట్​ లెజెండ్​ బోల్ట్​తో పోలుస్తున్న శ్రీనివాస ​కాంపిటీటివ్‌‌ పోటీలకు పనికొస్తాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. అయితే, ​బోల్ట్​తో తనను పోల్చడం సరికాదని శ్రీనివాస ​అంటున్నాడు. ‘అందరూ నన్ను ఉసేన్ ​బోల్ట్​తో పోలుస్తున్నారు. కానీ అతడో ప్రపంచ చాంపియన్. నేను కేవలం బురద మళ్లలో ‌‌‌‌‌‌‌‌పరిగెత్తేవాడిని’ అని చెప్పాడు. కాగా.. శ్రీనివాస​ రాత్రికి రాత్రే ఒలింపిక్​స్టార్ ​కాబోడని కంబళ అకాడమీ కన్వీనర్, చైర్మన్​ గుడప కదంబ పేర్కొన్నారు. అతడి సామర్థ్యాన్ని సైంటిఫిక్​గా జడ్జ్ ​చేయాలన్నారు.