అణ్వస్త్ర పరీక్షలు చేస్తం..త్వరలో కొత్త వెపన్ టెస్ట్

అణ్వస్త్ర పరీక్షలు చేస్తం..త్వరలో కొత్త వెపన్ టెస్ట్

సియోల్: అణ్వాయుధాలు, క్షిపణుల ప్రయోగాలపై ఇప్పటి దాకా విధించుకున్న సొంత నియంత్రణకు ఇక స్వస్తి పలుకుతున్నట్లు నార్త్​ కొరియా లీడర్​కిమ్ జోంగ్ ఉన్​ బుధవారం ప్రకటించారు. త్వరలోనే కొత్త వ్యూహాత్మక ఆయుధాన్ని పరీక్షిస్తామని స్పష్టం చేశారు. అమెరికాతో చర్చల కోసం కొంతకాలంగా అణ్వాయుధాలను పరీక్షించడంపై స్వీయ నియంత్రణ పాటిస్తున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా ప్రెసి డెంట్ ​డొనాల్డ్​ ట్రంప్ తో ఇప్పటికే మూడుసార్లు భేటీ అయినా చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడంలేదని కిమ్ చెప్పారు. అమెరికా తన సొంత ప్రయోజనాల కోసమే చర్చలకు అడ్డుపుల్లలు వేస్తోందని కిమ్ ఆరోపించారు. ఈ క్రమంలో అణ్వాయుధ పరీక్షలను ఆపేయడంలో ఎలాంటి అర్థం లేదని చెప్పారు.