ఒక్క టీచర్‌‌‌‌‌‌‌‌ పోస్టు భర్తీ చేయలే

ఒక్క టీచర్‌‌‌‌‌‌‌‌ పోస్టు భర్తీ చేయలే

‘జాబ్‌‌‌‌‌‌‌‌ రాక టీఆర్టీ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇద్దరు సూసైడ్‌‌‌‌‌‌‌‌ అటెంప్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇంత జరుగుతున్నా పోస్టింగులు ఇవ్వరా?’ అని ప్రభుత్వంపై తెలంగాణ విద్యార్థి వేదిక మండిపడింది. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క టీచరు పోస్టును భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించింది. సెలక్టయిన అభ్యర్థులకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ సోమవారం హుస్సేస్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర విద్యార్థి వేదిక లీడర్లు ఆందోళనకు దిగారు. ‘8,792 టీచర్‌‌‌‌‌‌‌‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2017 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో నోటిఫికేషన్ ఇచ్చి 2018 మార్చిలో 7 వేల మంది ఫలితాలను విడుదల చేసింది. ఆ 7,000 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినా ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వలేదు’ అని యూనియన్‌‌‌‌‌‌‌‌ లీడర్లు అన్నారు. విలీనం పేరుతో సర్కారీ స్కూళ్లను మూసేయడం నీచమైన చర్యని మండిపడ్డారు.