మన భూమిలో నుంచి ఒక్క అంగుళాన్నీ పోనివ్వం

మన భూమిలో నుంచి ఒక్క అంగుళాన్నీ పోనివ్వం

డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్

లేహ్: ఇండో–చైనా బార్డర్ వద్ద పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లేహ్‌ను సందర్శించారు. రాజ్‌నాథ్‌తో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఉండటం గమనార్హం. స్టక్నా పోస్ట్‌లో ఈ రోజు ఉదయం పారా డ్రాపింగ్‌తోపాటు మిగిలిన మిలటరీ ఎక్సర్‌‌సైజెస్‌ను రాజ్‌నాథ్ తిలకించారు. ఈ సందర్భంగా దళాలతో ఆయన చర్చించారు.

‘ఆక్రమణ యుగం ముగిసింది. ఇది అభివృద్ధికి సంబంధించిన యుగం. దురాక్రమణకు దిగిన వారు ఓడిపోతారు లేదా బలవంతంగా వెనక్కి తగ్గుతారనేది చరిత్ర చెబుతోంది. నేను మీకు భరోసా ఇవ్వగలను.. ప్రపంచంలోని ఏ శక్తి కూడా మన భూమిలో నుంచి ఒక్క ఇంచును కూడా తీసుకుపోదని హామీ ఇవ్వగలను’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.