అమెజాన్‌లో పెరిగిన లే ఆఫ్‌ల సంఖ్య

అమెజాన్‌లో పెరిగిన లే ఆఫ్‌ల సంఖ్య

ఆర్థిక మాంద్యం భయాలు, ఖర్చులు తగ్గించుకోవాలనే కారణాలు చెప్తూ  ఉద్యోగులను తొలగించేందుకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సిద్ధమైంది. ఇదివరకు కార్పొరేట్‌, టెక్నాలజీ విభాగాల్లో దాదాపు10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయాలు కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను 20 వేలకు పెంచింది. అంటే అమెజాన్ కంపెనీ నుంచి 20వేలమంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని టీమ్‌లు, పని తీరు సరిగా లేని ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించామని హార్డ్‌వేర్‌ చీఫ్‌ డేవ్‌ లింప్‌ ఉద్యోగులకు రాసిన నోటీస్‌లో స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోయే వాళ్లకు 24 గంటలముందే నోటీసులు ఇస్తారు. కంపెన్సేషన్ ప్యాకేజీని కూడా అందజేస్తారు. కొత్త జాబ్ వెతుక్కునేందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని చెప్తున్నారు.