హాకీ ప్రపంచ కప్ లోగోను ఆవిష్కరించిన ఒడిశా సీఎం

హాకీ ప్రపంచ కప్ లోగోను ఆవిష్కరించిన ఒడిశా సీఎం

భువనేశ్వర్‌: హాకీ పురుషుల ప్రపంచ కప్ లోగోను ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆవిష్కరించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ హాకీ (ఎఫ్‌ఐహెచ్‌)తో కలిసి ఒడిశా ప్రభుత్వం ఈ మెగా ఈవెంట్ కు ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం భువనేశ్వర్‌లోని కళింగ హాకీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌ఐహెచ్ ఒడిశా హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 అధికార లోగోను సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆవిష్కరించారు. 2023 జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పరుషుల ప్రపంచ కప్‌ పోటీ జరుగనుంది. కళింగ, బిర్సా ముండా స్టేడియాల్లో హాకీ మ్యాచ్‌లు జరుగనున్నాయి. పలు దేశాలకు చెందిన జట్లు ఈ ప్రపంచ కప్‌లో తలపడనున్నాయి. కాగా, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తొలి నుంచి హాకీ క్రీడకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశీయ హాకీ టీమ్‌కు స్పాన్సర్‌గా ఒడిశా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ టీం కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. 41 ఏండ్ల విరామం తర్వాత దేశానికి తిరిగి హాకీలో ఒలింపిక్‌ మెడల్‌ దక్కింది.

మరిన్ని వార్తల కోసం..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ

‘దళిత బంధు’తో దళితుల బతుకుల్లో వెలుగులు