
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంఆర్ కేటాయింపులు, ఎఫ్సీఐకి చేసిన సప్లై, మాయమైన బియ్యం గురించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసి సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. బియ్యం కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్న టీఆర్ఎస్ నాయకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఏటా రూ.100 కోట్ల ధాన్యం స్కాంకి పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.