మాదాపూర్ లో రోడ్డు పక్కన అక్రమ షాపులు కూల్చివేత

మాదాపూర్ లో రోడ్డు పక్కన అక్రమ షాపులు కూల్చివేత

హైదరాబాద్ సిటీలోని బిగ్ కమర్షియల్ ఏరియా అయిన మాదాపూర్ లో అక్రమంగా వెలిసిన.. రోడ్డు పక్కన షాపులను కూల్చివేశారు హైడ్రా అధికారులు. 2026, ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం నుంచి ఈ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. మాదాపూర్ ఏరియాలోని ఖానామెట్ సర్వేనెంబర్ 55లో అర్థనారీశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం పక్కన షాపులు నిర్మించారు కొందరు. షాపులు ఏర్పాటు చేసిన స్థలం ప్రభుత్వానిది. అక్రమంగా ఈ షాపులు నిర్మాణం చేపట్టారని గుర్తించిన హైడ్రా.. చర్యలకు సిద్ధం అయ్యింది. 

అర్థనారీశ్వర ఆలయం వెలుపల అక్రమంగా ఏర్పాటు అయిన షాపులను కూల్చివేస్తుంటే.. ఆలయం సభ్యులు, పూజారులు,, స్థానికులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ రోడ్డుపై బైఠాయించారు. కూల్చివేతకు ముందు నోటీసులు ఇవ్వాలని.. అలాంటి నోటీసులు లేకుండానే ఎలా కూల్చివేస్తారంటూ ఆందోళనకు దిగారు ఆలయం చైర్మన్ మహిపాల్ యాదవ్. 

►ALSO READ | నువ్వు ఇండియా వచ్చే వరకు విచారణ జరగదు: విజయ్ మాల్యాకు తేల్చి చెప్పిన కోర్టు

స్థానికుల ఆందోళనలను లెక్క చేయకుండా హైడ్రా అధికారులు తమ పని పూర్తి చేశారు. షాపులు అన్నింటినీ కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో.. రోడ్డు పక్కన అనధికారికంగా షాపులు ఏర్పాటు చేశారని.. అక్రమ నిర్మాణాలు అని స్పష్టం చేశారు హైడ్రా అధికారులు.