రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై స్పందించిన భగవంత్ మాన్

రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలపై స్పందించిన భగవంత్ మాన్

పంజాబ్ విద్యుత్ శాఖ అధికారులతో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కావడం పెద్ద దుమారం రేపింది. తాను లేని సమయంలో కేజ్రీవాల్ అధికారులతో భేటీ కావడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ట్రైనింగ్ కోసం తానే అధికారులను కేజ్రీవాల్ వద్దకు పంపానని వివరణ ఇచ్చుకున్నారు. ట్రైనింగ్ కోసం ఆఫీసర్లను ఢిల్లీకి పంపడంలో తప్పేముందని ప్రశ్నించారు. అవసరమైతే గుజరాత్, తమిళనాడు, ఏపీతో పాటు ఇజ్రాయెల్ కు కూడా పంపుతామని మాన్ చెప్పారు.

విద్య, విద్యుత్ రంగాల్లో ఢిల్లీ మంచి రికార్డులు సాధించినందుకే అక్కడకు పంపానని, దీనిపై ప్రతిపక్షాలకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. 
మంగళవారం నాడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేకుండానే ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. దీనిపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు అరవింద్ కేజ్రీవాల్ డీఫ్యాక్టో సీఎం అని, ఢిల్లీ రిమోట్ కంట్రోల్ అంటూ కామెంట్లు చేశాయి. కేజ్రీవాల్ ఫెడరలిజాన్ని అవమానించారని, దీనిపై పంజాబ్ సీఎం, కేజ్రీవాల్ ఇద్దరూ వివరణ ఇవ్వాలని పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సిద్ధూ డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

అంబేద్కర్ వాదులంతా తెలంగాణవైపు చూసేలా చేస్తం

సోనూ భాయి! నా భార్య నుంచి నన్ను రక్షించండి