సోనూ భాయి! నా భార్య నుంచి నన్ను రక్షించండి

సోనూ భాయి!  నా భార్య నుంచి నన్ను రక్షించండి

ఆపదలో ఆదుకోవడంలో సోనూసూద్ ముందుంటారు. ఎవరైనా సాయం కోసం అర్ధిస్తే.. వెంటనే స్పందించి తగిన సాయం చేస్తుంటారు. అయితే ఓ భార్య భాదితుడు తనను తన భార్య నుంచి కాపాడాలని సోనూసూద్కు  ఫన్నీ ట్వీట్ చేశాడు.

‘సోనూ భాయి.. మీరు ప్రతి ఒక్కరికీ సాయం చేస్తుంటారు. నా భార్య రోజు నా రక్తం తాగుతోంది (హింసిస్తోంది). దీనికి మీ దగ్గర ఏమైనా పరిష్కారముందా? ఒకవేళ ఉంటే చేతులు జోడించి అడుగుతున్నా... దయచేసి నా భార్య నుంచి నన్ను రక్షించండి’అని ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తి సోనూసూద్ ను వేడుకున్నాడు.

అయితే.. సోనూసూద్ అతడికి అంతే ఫన్నీగా సమాధానమిచ్చాడు.‘భాయి... ఇది ప్రతి భార్యకు జన్మతో వచ్చే అధికారం. నా మాట విను. ఆ రక్తంతో ఓ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చెయి’ అని బదులిచ్చాడు.

ఇవి కూడా చదవండి...

మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

స్వర్ణదేవాలయం ప్రార్థనల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

ఆలియా–రణబీర్ ఇంట్లో పెళ్లి సందడి షూరూ