హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. కావ్య థాపర్ హీరోయిన్. నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. గురువారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించిన క్లైమాక్స్‌తో మొత్తం షూట్ కంప్లీట్ అయ్యిందని మేకర్స్ తెలియజేశారు.
అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని, త్రినాథరావు నక్కిన మార్క్ ఎంటర్‌టైనర్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం రెడీ అవుతోందని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, జీటీవీ గణేష్, రోహిణి, హరితేజ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశాయి.
