ఏఐలోకి రూ.22.75 లక్షల కోట్ల పెట్టుబడులు: అశ్విని వైష్ణవ్

ఏఐలోకి రూ.22.75 లక్షల కోట్ల పెట్టుబడులు: అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: ఇండియాలో ఏఐ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేసేందుకు, 250 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.22.75 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని  కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఈ పెట్టుబడులు ప్రధానంగా డేటా సెంటర్లు, సెమీకండక్టర్ యూనిట్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, డిజిటల్ కనెక్టివిటీ వంటి ఏఐ ఇన్‌‌‌‌ఫ్రాపై ఫోకస్ అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్‌‌‌‌ సమిట్‌‌‌‌లో ఐదు రోజుల్లో ఐదు లక్షల మందికి పైగా పాల్గొన్నారు. 

గ్లోబల్ టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌‌‌‌లు ఆసక్తి చూపడం వల్ల ఇది “గ్రాండ్ సక్సెస్” అయ్యిందని వైష్ణవ్ పేర్కొన్నారు. త్వరలో ఏఐ మిషన్‌‌‌‌ 2.0 ప్రారంభమవుతుందని, ఇది కొత్త మోడల్స్, సేఫ్టీ ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌లు, కామన్ కంప్యూట్ సామర్థ్యాలపై దృష్టి పెడుతుందని  చెప్పారు.  ఉత్తరప్రదేశ్‌‌‌‌లో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభమవుతుందని,  మైక్రాన్ యూనిట్ ఫిబ్రవరి 28న ఓపెన్ అవుతుందని తెలిపారు.