మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను వెంట తీసుకెళ్లి నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేటలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళుర్పించేందకు వచ్చిన బీఎస్పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ప్రోటోకాల్ అంటూ అంబేద్కర్ దగ్గరకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అనుమతించలేదు. దీంతో ఆయన పోలీసులు, అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పేరుతో దళితులను అంబేద్కర్ కు దూరం చేస్తారా..? అంటూ మండిపడ్డారు. అయితే విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ ను అంబేద్కర్ విగ్రహం దగ్గరకి వెంటబెట్టుకెళ్లారు. దీంతో ఇద్దరు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. 

 

ఇవి కూడా చదవండి

స్వర్ణదేవాలయం ప్రార్థనల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

ఆలియా–రణబీర్ ఇంట్లో పెళ్లి సందడి షూరూ

గ్రామీణ రైతులకు అందుబాటులోకి డ్రోన్లు

నాన్నను చూసి.. నల్లకోటు వేసుకున్నా