పంజాగుట్ట, వెలుగు: విద్యుత్ శాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ తాత్కాలిక ఉద్యోగులు మంగళవారం ఖైరతాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఏడు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాల చెల్లింపు, క్రమబద్ధీకరణలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. జీవో నంబర్ 11 ప్రకారం తమను రెగ్యలరైజ్ చేయాలని, విద్యార్హతలకు అనుగుణంగా పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో జేఏసీ నాయకులు సతీశ్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్, సాయిలు, చందర్‌సింగ్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
