రూ.3.68 లక్షల మద్యం పట్టివేత

రూ.3.68 లక్షల మద్యం పట్టివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ స్పెషల్ డ్రైవ్​లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ బీ, సీ, డీ సీఐలు భిక్షా రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు సిబ్బంది శంషాబాద్​ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టు బయట రోడ్డుపై వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో ఢిల్లీ, గోవా నుంచి తీసుకువస్తున్న 99 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అలాగే, శంషాబాద్ రోడ్డులో శంషాబాద్ డీటీఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్, శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ కిరణ్ చేపట్టిన తనిఖీల్లో 85 బాటిల్స్​దొరికాయి. 12 మంది పై కేసు నమోదు చేశారు. దొరికిన మద్యం బాటిల్స్​ విలువ  రూ. 3.68 లక్షలు గా ఉంటుందన్నారు.