న్యూఢిల్లీ: బడ్జెట్ఎయిర్లైన్స్కంపెనీ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ఆయన బోర్డుకు తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా ఎయిర్‌లైన్ బాధ్యతలు చేపడతారు. గతేడాది డిసెంబర్‌లో ఎదురైన భారీ నిర్వహణ సంక్షోభం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
పైలెట్ల కొరత కారణంగా వేలాది ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. 2022 నుంచి సీఈఓగా పనిచేసిన ఎల్బర్స్ బోర్డు మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బోర్డు ఈ రాజీనామాను ఆమోదించి తదుపరి ఏర్పాట్లపై దృష్టి సారించింది.
