గ్రామీణ రైతులకు అందుబాటులోకి డ్రోన్లు

గ్రామీణ రైతులకు అందుబాటులోకి  డ్రోన్లు
  •     ఒక్కో డ్రోన్​కు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు
  •     ఆపరేటింగ్ కోసం 5 రోజుల పాటు శిక్షణ

హైదరాబాద్‌‌, వెలుగు: పంటపొలాలకు పురుగు మందులను స్ప్రే చేసే డ్రోన్లు గ్రామీణ రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో డ్రోన్‌‌ రూ.8 లక్షల నుంచి రూ.12లక్షలకు రైతులకు ఈ వానాకాలం నాటికి అందించేలా నోవా, అగ్రిబోట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అందుకు డీజీసీఎ అప్రూవల్ ఉన్న ఐవో టెక్‌‌తో బుధవారం అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటికే మేడ్చల్‌‌లో, ఏపీలో విజయవాడలో డ్రోన్‌‌ షోరూమ్, సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశారు. డ్రోన్ టెక్నాలజీ, ఆపరేటింగ్​పై రైతులకు 5 రోజుల పాటు శిక్షణ కల్పించనున్నారు. 10 లీటర్ల సామర్థ్యంతో ఉన్న ఈ డ్రోన్‌‌లు 10 మీటర్ల ఎత్తు 10 మీటర్ల వెడల్పు స్ప్రే చేస్తాయని, అలా రోజుకు 35 వేల ఎకరాల్లో పొలాలకు పురుగు మందులను స్ప్రే చేయవచ్చని నోవా అగ్రిగ్రూప్‌‌  ఎండీ ఎటుకూరి కిరణ్‌‌ కుమార్‌‌ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లా మండల స్థాయిలో డ్రోన్ల షోరూమ్‌‌లను, సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తామని చెప్పారు. శాటిలైట్‌‌ టెక్నాలజీ ద్వారా పని చేసే ఈడ్రోన్లు రసా యనాలు, పురుగు మందులు పంటపొలాల్లో ప్రతి మొక్కకు అందేలా స్ప్రే చేస్తాయని వివరించారు.