అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా : అభ్యర్థి కేడం లింగమూర్తి

అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా : అభ్యర్థి కేడం లింగమూర్తి
  •     హుస్నాబాద్​ 17వ వార్డు అభ్యర్థి కేడం లింగమూర్తి
  •     మంత్రి పొన్నంతో కలిసి ఇంటింటి ప్రచారం

హుస్నాబాద్, వెలుగు: వార్డు ప్రజలు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని హుస్నాబాద్  పట్టణ 17వ వార్డు అభ్యర్థి కేడం లింగమూర్తి తెలిపారు. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ కౌన్సిలర్​గా తనను గెలిపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్  సహకారంతో 17వ వార్డును పట్టణంలోనే ఆదర్శ వార్డుగా మారుస్తానని తెలిపారు.

కాంగ్రెస్  సీనియర్  నాయకుడిగా, బాల వికాస సంస్థ జాతీయ అధ్యక్షుడిగా, లైబ్రరీ చైర్మన్ గా చేసిన అనుభవం ఉందన్నారు. అభివృద్ధికి కావాల్సిన నిధులు తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. లింగమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని, వార్డు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్​ చెప్పారు.