హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది.బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఇన్‌చార్జీలు, ఎక్స్(ట్విట్టర్) హ్యాండ్లర్లకు వరుసగా నోటీసులిచ్చి విచారిస్తోంది. శుక్రవారం ‘తెలుగు స్ర్కైబ్’ ఫౌండర్ సామ్రాట్‌ను ప్రశ్నించింది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిని ‘తెలుగు స్ర్కైబ్’ టార్గెట్ చేసినట్లు తేలింది.
ఆ పోస్టుల లింకులను అప్పటి సిటీ టాస్క్ పోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ‘తెలుగు స్ర్కైబ్’ పంపేదని..ఆ లింకుల ఆధారంగా ఆయన బీఆర్ఎస్ , కేసీఆర్ ను విమర్శించిన వారిని బెదిరించేవారని గుర్తించింది. రాధాకిషన్ రావు కాల్ లిస్టులో బాధితుల సమాచారం ఆధారంగా తెలుగు స్ర్కైబ్ సామ్రాట్ ను అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ సమాచారంతో తెలుగు స్ర్కైబ్‌కు చెందిన మరికొంత మందిని విచారించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తోంది.
