- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు టీఆర్టీఎఫ్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2,325 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జీవో 25ను సవరించి, టీచర్ల సంఘాలతో చర్చించిన తర్వాతే రేషనలైజేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
జీరో ఎన్‌రోల్‌మెంట్ బడులను అవసరమున్న చోటికి మార్చాలని సూచించారు.అలాగే..టీచర్లు, ఎంప్లాయీస్ కు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణ రావును కలిసి వినతిపత్రం అందించారు.
