సిడ్నీ: ఏఎఫ్‌సీ విమెన్స్ ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది. మంగళవారం తప్పక గెలవాల్సిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఇండియా 1–-3 తేడాతో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌లో ఎక్కువ భాగం బాల్‌పై ఆధిపత్యం చెలాయించినప్పటికీ, వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు.
ఇండియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను 39వ నిమిషంలో మనీషా కల్యాణ్ సాధించింది. చైనీస్ తైపీ జట్టులో వై సు (12వ ని), యు-చిన్ చెన్ (77వ ని) చెరో గోల్ చేశారు. అలాగే, ఫస్టాఫ్ చివర్లో (45+8వ ని) బాల్ ఇండియా గోల్‌కీపర్ పంథోయ్ చానుకు తగిలి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడంతో తైపీ ఖాతాలో మరో గోల్ చేరింది.
