వైభవంగా మధుర మీనాక్షి కళ్యాణ వేడుకలు

వైభవంగా మధుర మీనాక్షి కళ్యాణ వేడుకలు

మధురై: తమిళనాడులో మీనాక్షి కళ్యాణ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మధురైలోని ఆలయంలో మీనాక్షి అమ్మవారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  చితిరాయ్ తిరువిజా పేరుతో ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఎలాంటి వేడుకలు నిర్వహించని విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోయి మళ్లీ కరోనాకు ముందు రోజుల నాటి పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో వేడుకలు జరుగుతున్నాయి. 
రెండేళ్లుగా వేడుకలు లేకపోవడంతో ఇప్పుడు జరుగుతున్న వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల ఐదో తేదీన వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా ఆంక్షలతో మొక్కుబడులు, దర్శనాలకు నోచుకోని ప్రజలు వేడుకల్లో భాగంగా అమ్మవారి దర్శనానికి భారీగా పోటెత్తుతున్నారు. ఎల్లుండి జరగనున్న భారీ రథయాత్రతో ఈ వేడుకలు ముగియనున్నాయి.

 

 

ఇవి కూడా చదవండి

కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించాలి

సోనూ భాయి! నా భార్య నుంచి నన్ను రక్షించండి

రైలులో బాంబు ఉందని ఫేక్ ఫోన్ కాల్ చేసిన ఆకతాయి అరెస్ట్

ఏపీ నుండి వస్తున్న ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్న అధికారులు

మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్