
హైదరాబాద్: కుల వివక్షలేని సమాజం రావాలని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా దళితులు, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. కరోనా కాలంలో కూడా దాడులు జరిగాయని.. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫెడరల్ వ్యవస్థను భగ్నం చేస్తున్నారు
దేశంలో ఫెడరల్ వ్యవస్థను కూడా భగ్నం చేస్తున్నారని బీవీ రాఘవులు ఆరోపించారు. ఢిల్లీ జేఎన్ యూలో రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఆహారం విషయంలో విద్యార్థులపై దాడి జరిగిందన్నారు. అంబేద్కర్ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడాలన్నారు. దేశ వ్యాప్తంగా కుల వివక్ష లేని సమాజ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు కలిసి రావాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా కలిసొచ్చే వారితో కలసి కార్యక్రమాలు నిర్వహిస్తామని బీవీ రాఘవులు ప్రకటించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని రాఘవులు కోరారు.
ఇవి కూడా చదవండి
సోనూ భాయి! నా భార్య నుంచి నన్ను రక్షించండి
రైలులో బాంబు ఉందని ఫేక్ ఫోన్ కాల్ చేసిన ఆకతాయి అరెస్ట్
ఏపీ నుండి వస్తున్న ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్న అధికారులు
మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్