హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈఎన్సీ జనరల్‌ను నియమించింది. జనవరి 31న అంజద్ హుస్సేన్ రిటైర్మెంట్ తో వారం రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఫైల్స్ ఎక్కడివక్కడ పేరుకుపోతుండడంతో.. తాజాగా ప్రభుత్వం ఓలేటి వెంకటరమేశ్ బాబుకు ఈఎన్సీ జనరల్ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఈఎన్సీ అడ్మిన్‌గా కూడా పనిచేస్తున్న ఆయనకు.. ఈఎన్సీ జనరల్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఈ మేరకు శుక్రవారం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రమేశ్ బాబు కూడా మార్చిలో రిటైర్ కాబోతున్నారు. దాదాపు రెండు నెలలు ఆయన ఈఎన్సీగా బాధ్యతల్లో ఉండనున్నారు. ప్రస్తుతం నారాయణపేట ఈఈ కె.బ్రహ్మానంద్కు కొడంగల్ ఈఈగా, కరీంనగర్ డిప్యూటీ సీఈ కె.రాధాకృష్ణకు కరీంనగర్ డిప్యూటీ ఎస్ఈగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
