డిసెంబర్ నాటికి సెన్సెక్స్ లక్షా 7 వేలు

డిసెంబర్ నాటికి సెన్సెక్స్ లక్షా 7 వేలు

న్యూఢిల్లీ:  ఈ ఏడాది చివరి నాటికి బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్  1,07,000 లెవెల్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ కంపెనీ మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈ ఇండెక్స్ శుక్రవారం 0.32 శాతం పెరిగి 83,580 దగ్గర ముగిసింది. కొవిడ్ సంక్షోభంతో నెలకొన్న ఆర్థిక సమస్యలు గాడిలో పడ్డాయని, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ, ప్రభుత్వం తీసుకున్న రేటు కోతలు, బ్యాంకింగ్ డీ-రెగ్యులేషన్, వ్యవస్థలో లిక్విడిటీ పెంచడం, మూలధన వ్యయం కొనసాగింపు, పన్ను తగ్గింపులు, బడ్జెట్ మెరుగ్గా ఉండడం వంటివి ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తున్నాయని మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. 

 ‘‘చైనాతో ఇండియా సంబంధాలు  మెరుగుపడ్డాయి.  వాణిజ్య ఒప్పందాలు కూడా సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తున్నాయి. భారత స్టాక్స్  వాల్యూయేషన్స్ తక్కువగా ఉండడం, ఈ మధ్య మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కరెక్షన్ రావడం,  ప్రభుత్వ  పాలసీ సపోర్ట్, కరెన్సీ విలువ  బాగా తగ్గడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగొచ్చే అవకాశం ఉండడం ,  కొత్త బైబ్యాక్ సైకిల్ వంటి అరుదైన కలయిక ప్రస్తుతం కనిపిస్తోంది.  నాలుగు కీలక వృద్ధి కారకాలు మార్కెట్‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళతాయి.  కంపెనీల  లాభాల్లో  మెరుగుదల, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పాలసీ ద్వారా లిక్విడిటీ, ప్రైవేటైజేషన్ వంటి సంస్కరణలు, విదేశీ కొనుగోళ్లు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాయి.  2026లో సెన్సెక్స్ బుల్ రన్ ఉంటే  1,07,000 వరకు , బేస్ కేస్‌‌‌‌‌‌‌‌లో 95 వేలకు, పడితే  76 వేల వరకు రావొచ్చు”అని ఈ రిపోర్ట్ అంచనా వేసింది.