రైలులో బాంబు ఉందని ఫేక్ ఫోన్ కాల్ చేసిన ఆకతాయి అరెస్ట్

 రైలులో బాంబు ఉందని ఫేక్ ఫోన్ కాల్ చేసిన ఆకతాయి అరెస్ట్
  • పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలని అలా చేశానంటున్న నిందితుడు

హైదరాబాద్: రైలులో బాంబ్ ఉందన్న ఫోన్ కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ కాల్ చేసింది గండిమైసమ్మ బహదూర్ పల్లికి చెందిన తొర్రి కార్తిక్ (19) గా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకిలా చేశావని ప్రశ్నించగా.. పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలని అలా చేశానని నిందితుడు చెప్పడంతో ఆ సమాధానం విని అవాక్కయ్యారు.
విశాఖ నుంచి వచ్చే రైలులో బాంబు ఉందని బుధవారం ఫోన్ కాల్ రావడంతో కొన్ని గంటలపాటు అందరూ ఉరుకులు, పరుగులు పెట్టారు. ఫేక్ కాల్ అని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ ఫోన్ కాల్ చేసిందెవరో తెలుసుకునేందుకు లోకల్ పోలీసులు, రైల్వే పోలీసులు ఉమ్మడిగా వేట ప్రారంభించారు. టెక్నాలజీ సాయంతో కాల్ చేసిన నిందితుడి ఆచూకీ కనిపెట్టి ఆకతాయిని పట్టుకున్నారు. ఎందుకు ఇలాంటి ఫేక్ కాల్ చేశావని ప్రశ్నించగా తన కాల్ కు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని అలా కాల్ చేశానని చెప్పాడు. నిందితుడ్ని అరెస్టు చేశారు. 

 

ఇవి కూడా చదవండి

ఏపీ నుండి వస్తున్న ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్న అధికారులు

మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

స్వర్ణదేవాలయం ప్రార్థనల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

ఆలియా–రణబీర్ ఇంట్లో పెళ్లి సందడి షూరూ