హైదరాబాద్‌సిటీ, వెలుగు: వాటర్‌బోర్డు సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లోని దాసరి తనూజ రెడ్డి పేరుతో ఉన్న ఇంటి వద్ద ఫ్లోర్ నిర్మాణం చేస్తున్నారు.
ఈ నిర్మాణానికి నీటిని దుర్వినియోగం చేసినట్లు స్థానిక అధికారులు గుర్తించి రూ.5 వేల ఫైన్ వేశారు. తాగునీటి దుర్వినియోగంపై నగర వాసులు వాట్సాప్ నంబర్ 99499 30003 లేదా మెట్రో కస్టమర్ కేర్ 155313 ద్వారా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
