
సూర్యాపేట: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఎవరూ ధాన్యం తీసుకురాకుండా సరిహద్దు గ్రామం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు అధికారులు. ధాన్యం కొనుగోలు కోసం రైతులంతా ఎదురుచూసీ చూసీ విసిగిపోతున్న తరుణంలో ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కొనుగోలు చేసే దిక్కులేక అల్లాడి వచ్చినకాడికి చాలంటూ చాలా మంది అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొన్న తరుణంలో ప్రభుత్వం ఒకవైపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ.. మరో వైపు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.
ఏపీ నుంచి వచ్చే రవాణా వాహనాలను కట్టడి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం రవాణా చేస్తున్న వాహనాలను పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆంధ్ర ధాన్యం తెలంగాణాలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీ నుండి వస్తున్న ధాన్యం లారీలను వెనక్కి తిప్పి పంపుతున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి
మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్