ఏపీలో ఆపరేషన్ వైట్ హ్యామర్.. ఎన్టీఆర్ జిల్లాలో రూ. 47 కోట్ల డ్రగ్స్ సీజ్

ఏపీలో  ఆపరేషన్  వైట్ హ్యామర్.. ఎన్టీఆర్ జిల్లాలో రూ. 47 కోట్ల డ్రగ్స్ సీజ్

ఏపీలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలోని పలు చోట్ల  ఆపరేషన్ వైట్ హ్యామర్ పేరుతో డీఆర్ఐ చేపట్టిన దాడుల్లో దాదాపు రూ.  47 కోట్ల విలువైన  అల్ఫ్రాజోలామ్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఆపరేషన్ వైట్ హ్యామర్ పేరుతో డీఆర్ఐ అధికారులు ఎన్టీఆర్ జిల్లాలో ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో మార్చి 11,12 తేదీల్లో సోదాలు చేశారు.  ఈ దాడుల్లో 237 కిలోల అల్ప్రాజోలామ్ స్వాధీనం చేసుకున్నారు.  దీని  విలువ దాదాపు రూ.  47 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా వేశారు.  అదనంగా 800 కిలోల రా మెటీరియల్స్, 2,860 లీటర్ల కెమికల్స్ ను  స్వాధీనం చేసుకున్నారు.  

ఫ్యాక్టరీలో రియాక్టర్, డ్రైయర్, సెంట్రిఫ్యూజ్ వంటి ఇండస్ట్రియల్ మెషీన్లు సీజ్ చేశారు అధికారులు. దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఓ  వ్యక్తి ఈ రాకెట్‌కు మాస్టర్‌మైండ్ గా నిర్వహించారని అధికారులు గుర్తించారు.  అతనితో కలిసి పనిచేసిన మరో వ్యక్తి హైదరాబాద్లో పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.  ఇద్దరిని అరెస్ట్ చేశారు.  డ్రగ్ తయారీ యూనిట్‌ను కెమికల్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని నడపతున్నట్లు గుర్తించారు డీఆర్ఐ అధికారులు.  డీఆర్ఐ అధికారులు ఈ సంవత్సరంలో 8 అక్రమ డ్రగ్ తయారీ యూనిట్లను గుర్తించారు.