ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సహచర ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో మరిన్ని విషయాలు ప్రస్థావించారు. రిపోర్టు ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలికంటే ముందే మరో ఇద్దరు యువతులకు ప్రపోజ్ చేసినట్లు రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది.
ఈ కేసులో నేషనల్ పోలీస్ అకాడమీ సిబ్బంది , పలువురు ట్రైనీ ఐపీఎస్ లను విట్నెస్ లుగా చేర్చారు పోలీసులు. ఉదయ్ కృష్ణా రెడ్డి Abhyas ఐఎఎస్ అకాడమీ ను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాక్ గ్రౌండ్ పట్ల బాధితురాలికి సానుభూతి కలిగినట్లు ప్రస్థావించారు. బాధితురాలికి జూనియర్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీకి ఇంప్రెస్ అయిన బాధితురాలు అతనితో సన్నిహితంగా మెలిగినట్లు తెలిపారు.
బాధితురాలు కంటే ముందు మరో ఇద్దరు యువతులకు ఉదయ్ కృష్ణా రెడ్డి ప్రపోజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఒక యువతి ఉదయ్ తో పెళ్లికి నిరాకరించడంతో.. ఆ తర్వాత బాధితురాలితో సన్నిహితంగా ఉన్నట్లు వెల్లడించారు.
►ALSO READ | ఫార్ములా ఈ కేసులో రేపు ( జులై 31 ) ఏసీబీ కోర్టుకు కేటీఆర్...
అయితే ఉదయ్ కృష్ణారెడ్డి వింత ప్రవర్తన, ఎక్కువ పొసెసివ్, రూడ్ బిహేవియర్ తో విసిగిపోయిన బాధితురాలు అతడిని దూరం పెట్టింది. తనను దూరం పెట్టడంతోనే బాధితురాలిని వేధించి ఆమె పై హత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం అశోక్ నగర్ లోని ఉదయ్ నివాసం లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్ లోనూ కొన్ని వీడియోలను సేవ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయ్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు.
