ఫార్ములా ఈ కేసులో రేపు ( జులై 31 ) ఏసీబీ కోర్టుకు కేటీఆర్...

ఫార్ములా ఈ కేసులో రేపు ( జులై 31 ) ఏసీబీ కోర్టుకు కేటీఆర్...

తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ కేసు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ( జులై 31 ) నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసు విచారణకు సంబంధించి ఏసీబీ కోర్టుకు హాజరవుతానని ఇప్పటికే ప్రకటించారు కేటీఆర్.

ఈ క్రమంలో కేటీఆర్ తో పాటు మరో నలుగురికి సమన్లు జారీ చేసింది ఏసీబీ. ఏసీబీ చార్జిషీట్ లో కేటీఆర్ ఏ1 గా ఉన్నారు. ఫార్ములా ఈ కేసులో రూ.55 కోట్ల నిధుల మళ్లింపుపై ఆరోపణలు చేస్తోంది ఏసీబీ. ఈ కేసులో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ పాత్రపై కూడా ఫోకస్ పెట్టింది ఏసీబీ.

ఇదిలా ఉండగా రాజకీయ కక్షసాధింపు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు పెట్టిందంటూ ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఇది లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ ఇదివరకే కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపటి విచారణపై బీఆర్ఎస్, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.