దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2026 వేడుకకు కౌంట్ డౌన్ మొదలైంది. 2025లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు సంబంధించిన నామినేషన్స్‌ను సైమా కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కూడా తెలుగు సినిమాలు తమ సత్తా చాటాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాల నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ వరకు అవార్డుల జాబితాలో ఆధిపత్యం చెలాయించాయి.
'మిరాయ్' మెరుపులు..
ఈ ఏడాది నామినేషన్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘మిరాయ్’. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం విడుదల సమయంలోనే విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను మెప్పించగా.. ఇప్పుడు అదే జోరును సైమా నామినేషన్స్‌లోనూ కొనసాగించింది.
Some stories entertain. Others transport you to an entirely new world.
— SIIMA (@siima) July 30, 2026
Mirai did just that, blending mythology, adventure and imagination into a cinematic spectacle that left audiences wanting more. Its nominations at Maruti Suzuki NEXA SIIMA 2026 celebrate the vision, scale and… pic.twitter.com/nx3sb8KaVw
Also Read ; భారీ అంచనాలు.. మిక్స్‌డ్ టాక్.. ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' గట్టిపోటీ..
అదే సమయంలో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా అవార్డుల రేసులో బలంగా నిలిచింది. కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ బ్లాక్‌బస్టర్ సినిమా 10 విభాగాల్లో నామినేషన్స్ సాధించి 'మిరాయ్ ' కు గట్టిపోటీ ఇచ్చింది.. సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించింది.
Sankrantiki Vasthunnam reminded us why family entertainers continue to hold a special place in our hearts.
— SIIMA (@siima) July 30, 2026
With its effortless humour, memorable characters and moments that brought audiences together, the film became one of the year's biggest celebrations on the big screen. Its… pic.twitter.com/8RRnondgW6
అవార్డుల బరిలో 'తండేల్', 'కోర్ట్'
ఇక నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్', అలాగే నాని నిర్మించిన కోర్ట్‌రూమ్ డ్రామా 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ నోబడీ' చిత్రాలు చెరో 9 నామినేషన్స్ దక్కించుకుని అవార్డుల పోరును మరింత రసవత్తరంగా మార్చాయి. నటన, దర్శకత్వం, సంగీతం, సాంకేతిక విభాగాల్లో ఈ సినిమాలు బలమైన పోటీ ఇవ్వనున్నాయి. ఒకవైపు ఎమోషనల్ లవ్ స్టోరీతో ‘తండేల్’ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోగా, మరోవైపు సామాజిక అంశాలతో తెరకెక్కిన 'కోర్ట్'విమర్శకుల ప్రశంసలు అందుకుని ఇప్పుడు అవార్డుల బరిలోనూ సత్తా చాటుతోంది.
Thandel is a story of love that refused to give up, even when tested by distance, borders and fate.
— SIIMA (@siima) July 30, 2026
With heartfelt performances and an emotional journey that stayed with audiences long after the credits rolled, the film has earned its place among the nominees at Maruti Suzuki… pic.twitter.com/oNk4u53Lfg
అత్యంత వైభవంగా..
రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్న SIIMA 2026 అవార్డుల వేడుక సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరగనుంది. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన అగ్రతారలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపై సందడి చేయనుండటంతో ఈ వేడుకపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారి అత్యధిక నామినేషన్స్‌ను అవార్డులుగా మార్చుకుని విజేతగా నిలిచేది ‘మిరాయ్’నా? లేక ‘సంక్రాంతికి వస్తున్నాం’నా? లేదా ‘తండేల్’, ‘కోర్ట్’ చిత్రాలు సర్‌ప్రైజ్ ఇస్తాయా? అన్న ఉత్కంఠ ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది.
Court: A State Vs a Nobody has been one of the year's most talked-about films, earning admiration for the conviction and craft behind its storytelling.
— SIIMA (@siima) July 30, 2026
As it receives multiple nominations at Maruti Suzuki NEXA SIIMA 2026, the film stands as a proud recognition of the vision and… pic.twitter.com/iBAse18IG5
