సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో తరం హీరోగా జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. భారీ అంచనాల మధ్య జూలై 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మూవీ తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.1.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్‌వైడ్ గా దాదాపు రూ.2 కోట్ల వరకు గ్రాస్ సాధించిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
‘శ్రీనివాస మంగాపురం’ బడ్జెట్, బిజినెస్:
కల్కి నిర్మాత అశ్వనీదత్ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించారు. ప్రమోషన్స్తో కలుపుకుని సుమారు రూ.20 కోట్ల బడ్జెట్తో మూవీ తెరకెక్కినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే, సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో ఈ సినిమాకు వీకెండ్ కలెక్షన్స్ చాలా కీలకంగా మారాయి. రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ఆదరణ పెరిగితేనే బాక్సాఫీస్ వద్ద పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read ; SIIMA 2026లో టాలీవుడ్ హవా.. 'మిరాయ్'కు 11 నామినేషన్స్
ఇక ఇప్పటికే థియేటర్లలో కొనసాగుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’, అలాగే హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ నుంచి పోటీ ఉండటంతో ‘శ్రీనివాస మంగాపురం’ వసూళ్లపై ప్రభావం పడినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్‌తో కొనసాగుతున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.
అజయ్ భూపతి తన మార్క్ మిస్ అయ్యాడా?
RX 100, మంగళవారం, మహా సముద్రం వంటి క్రేజీ సినిమాలతో అదరగొట్టిన అజయ్ భూపతి.. ఈ సినిమాకు తన మార్క్ను చూపించడంలో ఫెయిల్ అయ్యాడని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. రొటీన్ స్టోరీ, స్లో నేరేషన్ ఆడియన్స్తో పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే, హీరోగా తొలి అడుగు వేసిన జయకృష్ణ నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే, ఇవాల్టీ వరకు వర్కింగ్ డేస్ అవ్వడంతో వసూళ్లపై ఇంపాక్ట్ పడిన.. ఇపుడు వీకెండ్లో వచ్చే కలెక్షన్స్, ఆడియన్స్ టాక్ సినిమా భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది.
