ఆంధ్ర ప్రదేశ్ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు ప్రత్యేక ఫ్లైట్ షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఈ షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్ - భోగాపురం మధ్య ప్రతిరోజూ 5 సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. అలాగే బెంగళూరు - భోగాపురం మధ్య రోజూ 2 సర్వీసులు ఉండగా.. ఆదివారం, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు ఈ రూట్లో మరో అదనపు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. ఇక విజయవాడ - భోగాపురం మధ్య ప్రయాణించే వారి కోసం రోజూ 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది.
విజయనగరం జిల్లా అల్లూరి సీతారామరాజు(భోగాపురం) అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1, 2026 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం (INS Dega) లోని సివిల్ ఎన్‌క్లేవ్ నుంచి షెడ్యూల్డ్ విమాన సర్వీసులు అన్నీ భోగాపురానికి మారుతున్నాయి.
