మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన భారీ వరద .. 85 గేట్లు ఎత్తివేత

మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తిన భారీ వరద .. 85 గేట్లు ఎత్తివేత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గత మూడు రోజులుగా ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత నదులకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఉభయ నదులు నిండుకుండలా మారి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  నదుల ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

అటు మేడిగడ్డ బ్యారేజీలోకి 10 లక్షల 62 వేల240  నలభై క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది.    ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. భారీగా పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారిక సూచనలు పాటించాలని హెచ్చరించారు.

ALSO READ : భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిరిండియా కొత్త ఫ్లైట్ షెడ్యూల్