Indian Royals vs Bangladesh Tigers: ఏషియన్ లెజెండ్స్ లీగ్ (ALL) 2026 సీజన్-2 లీగ్ పోటీలు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. టోర్నమెంట్లో భాగంగా ఈరోజు (జూలై 31, శుక్రవారం) జరగనున్న 3వ మ్యాచ్‌లో ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్ జట్లు తలపడనున్నాయి. జాంబియాలోని లుసాకాలో ఉన్న లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్ ఈ పోరుకు వేదిక కానుంది. శిఖర్ ధావన్, సురేష్ రైనా, దినేష్ కార్తీక్, హర్భజన్ సింగ్ వంటి భారత మాజీ దిగ్గజాలతో పాటు షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు హోరాహోరీగా తలపడనున్నాయి.
మ్యాచ్ లైవ్ టెలికాస్ట్:
* టోర్నీ: ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 (మ్యాచ్ 3)
* తేదీ & సమయం: శుక్రవారం, జూలై 31, 2026 | సాయంత్రం 5:00 గంటలకు (IST)
* వేదిక: లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, లుసాకా, జాంబియా
* టీవీ ప్రసారం: భారత్‌లో Sony Sports Ten 3 ఛానెల్‌లో లైవ్ వీక్షించవచ్చు.
* లైవ్ స్ట్రీమింగ్: FanCode యాప్ మరియు వెబ్‌సైట్‌లో లైవ్ అందుబాటులో ఉంటుంది.
అంచనా తుది జట్లు:
ఇండియన్ రాయల్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), అంబటి రాయుడు, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, రిషి ధావన్, హర్భజన్ సింగ్, షాబాజ్ నదీమ్, మన్‌ప్రీత్ గోనీ, పవన్ నేగి.
Also Read ; ఫుట్‌బాల్‌ను అమ్మడం లేదు..
బంగ్లాదేశ్ టైగర్స్: తుషార్ ఇమ్రాన్, మెహెదీ మారూఫ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నయీమ్ ఇస్లామ్, శువగతా హోమ్, ధీమన్ ఘోష్ (వికెట్ కీపర్), ముక్తార్ అలీ, జియావుర్ రెహమాన్, రుబెల్ హుస్సేన్, షఫీవుల్ ఇస్లామ్, ఎలియాస్ సన్నీ.
ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే?:
బ్యాటింగ్ విభాగంలో ఇండియన్ రాయల్స్ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. ధావన్, రాయుడు, రైనా, యూసుఫ్ పఠాన్, కార్తీక్ లతో కూడిన మిడిలార్డర్ ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలదు. మరోవైపు షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ టైగర్స్ జట్టులో మంచి ఆల్‌రౌండర్లు ఉన్నప్పటికీ, అనుభవం, మ్యాచ్ విన్నర్ల పరంగా భారత రాయల్స్ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
