హైకోర్టు న్యాయవాదిని ను బూతులు తిడుతూ... బూటుకాలితో తన్నిన హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు 

హైకోర్టు న్యాయవాదిని ను బూతులు తిడుతూ... బూటుకాలితో తన్నిన హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు 

ఏపీలోని సత్యసాయి జిల్లా హిందూపురం సీఐ రాజగోపాల నాయుడు వివాదంలో చిక్కుకున్నాడు. బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ పై సీఐ దురుసు ప్రవర్తన దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జులై 27న హిందూపురంలోని మాతృశ్రీ ప్రైవేట్ ఆసుపత్రిలో రమ్యశ్రీ అనే మహిళ సిజేరియన్ చేశాక మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు, బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో ఆసుపత్రి దగ్గరికి వచ్చిన సీఐ రాజగోపాల్ నాయుడు శివరామకృష్ణ సహా మృతురాలి బంధువులతో దురుసుగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ రెచ్చిపోయాడు సీఐ. శివరామకృష్ణను బూటు కాలితో తన్నాడు సీఐ. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తే.. ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మక్కై సీఐ దారుణంగా ప్రవర్తించాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు దళిత సంఘాల నాయకులు. సీఐ రాజగోపాల్ నాయుడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడని.. అందరి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని... అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.