హర్షిత్‌‌ రాణా ఐపీఎల్‌‌కూ కష్టమే!

హర్షిత్‌‌ రాణా ఐపీఎల్‌‌కూ కష్టమే!

కోల్‌‌కతా: ఐపీఎల్‌‌–19కు ముందు కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌కు బ్యాడ్‌‌ న్యూస్‌‌.  మోకాలి సర్జరీ నుంచి కోలుకుంటున్న స్టార్‌‌ పేసర్‌‌ హర్షిత్‌‌ రాణా ఈ సీజన్‌‌లో చాలా మ్యాచ్‌‌లకు దూరం కానున్నాడు. హర్షిత్‌‌ రీ ఎంట్రీపై బీసీసీఐ ఎలాంటి కాలపరిమితి విధించలేదు. 

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌‌ కప్‌‌ వామప్‌‌ మ్యాచ్‌‌లో రాణా కుడి మోకాలి లిగమెంట్‌‌ చీరుకుపోయింది. సర్జరీ తర్వాత అతను రిహాబిలిటేషన్‌‌లో ఉన్నాడు. బీసీసీఐ మెడికల్‌‌ టీమ్‌‌ రాణా గాయం పురోగతిపై ఎలాంటి నివేదిక ఇవ్వకపోవడంతో అతను మెగా లీగ్‌‌కు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత కొనసాగుతోంది.

ఒకవేళ హర్షిత్‌‌ రాణా పూర్తిగా అందుబాటులో లేకపోతే సమర్‌‌జిత్‌‌ సింగ్‌‌ను జట్టులోకి తీసుకునే చాన్స్‌‌ ఉంది. ఇక శ్రీలంక పేసర్‌‌ మతీషా పతిరానా కూడా కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దాంతో అతను ఆడటంపై కూడా స్పష్టత లేదు. బంగ్లాదేశ్‌‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ పేసర్‌‌ ముస్తాఫిజుర్‌‌ను కేకేఆర్‌‌ రిలీజ్‌‌ చేసింది. అతని ప్లేస్‌‌లో జింబాబ్వే పేసర్‌‌ బ్లెసింగ్‌‌ ముజరబానీని జట్టులోకి తీసుకున్నారు. ఆర్సీబీ పేసర్​ జోష్​ హాజిల్​వుడ్​ కూడా తొలి రెండు వారాలు అందుబాటులో ఉండకపోవచ్చు.