ఫాక్స్ కాన్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన అధికారులు

ఫాక్స్ కాన్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన అధికారులు

ఇబ్రహీంపట్నం, వెలుగు: యాపిల్ ఫోన్ల స్పేర్ పార్ట్స్ తయారీ పరిశ్రమ ఫాక్స్ కాన్ ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ లోని కొంగరకుర్దులో ఉన్న టీఎస్ఐఐసీకి చెందిన 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఫాక్స్ కాన్ కు కేటాయించిన ఈ భూమిలో ఈనెల15న ఆ సంస్థ భూమి పూజ చేయనుంది.

కాగా ఈ స్థలాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహా రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ ఏర్పాటుతో స్థానికంగా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఫాక్స్ కాన్ బృందం సభ్యులు పాల్గొన్నారు.