పార్లమెంట్ లో కరోనా కలకలం

పార్లమెంట్ లో కరోనా కలకలం

కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. ఓ పక్క కరోనా కేసులు.. మరోపక్క ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. అయినా కూడా కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్లమెంట్ లో కరోనా కేసులు బయటపడ్డాయి. పార్లమెంట్ లో పనిచేసే 402 మందికి కరోనా సోకింది. మొత్తం 1,409 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో 402 మంది స్టాఫ్‎కి పాజిటివ్‎గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. పాజిటివ్ బారినపడిన వారిని సరైన ప్రికాషన్స్ తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారిలో 200 మంది లోక్‎సభ సిబ్బంది ఉంటే.. 69 మంది రాజ్యసభ సిబ్బంది ఉన్నారు. మిగతా 133 మంది సిబ్బంది ఇతర స్టాఫ్‎గా అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారితో పాటు.. కాంటాక్ట్‎లను ట్రేస్ చేసి హొం ఐసోలేషన్‎కు తరలించారు. కరోనా వ్యాప్తితో కార్యాలయాలు 50 శాతం కెపాసిటీతో రన్ చేయాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు సిబ్బందికి కరోనా సోకడంతో సమావేశాలపై సందిగ్ధత నెలకొంది.