
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇన్నేళ్లకు వారి ఆశలకు పులిష్టాప్ పడనుంది. త్వరలోనే తెలుగులో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం..నేడు (మే1న) అజిత్ 53 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.అయితే, అందరిలో కన్న అజిత్ భార్య షాలిని భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ను బర్త్ డే కానుకగా అందించింది.తనకంటే విలువైన కానుక ఏముందంటారా? విలువైనది కంటే..ఇష్టమైన కానుక అని అనొచ్చు.
తాజాగా అజిత్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసిన షాలిని ఆయనకి డుకాటీ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఎందుకంటే హీరో అజిత్ కు అజిత్ ప్రొఫిషనల్ రేసర్ అన్న విషయం తెలిసిందే. కనుక ఆయనకు బైక్స్ అన్న..బైక్ రైడింగ్ అన్న చాలా ఇష్టం. ఈ బైక్స్ మీద ఇండియా మొత్తం చుట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం షాలినీ ఇచ్చిన బైక్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇందుకు వైరల్ అవుతున్నాయి.ప్రేమతో ఇండియాని చుట్టేస్తాడేమో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Shalini Mam Gifted Ducati Bike For ?? #Thala #HBDAjithKumar #AjithKumar pic.twitter.com/UByfKHEhfn
— Sri Ajith™ (@SriAjithOff) April 30, 2024
ఇక అజిత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన విడాయమర్చి అనే సినిమా చేస్తున్నారు. షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మార్క్ ఆంటోనీ సినిమా దర్శకుడు అధిక రవిచంద్రన్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ఈ సినిమాను చేస్తున్నాడు.