ఇయర్ ఎండ్ సేల్స్‌తో జోరందుకున్న ఆన్‌లైన్ షాపింగ్

ఇయర్ ఎండ్ సేల్స్‌తో జోరందుకున్న ఆన్‌లైన్ షాపింగ్
ఆఫర్లతో అట్రాక్ట్ చేస్తోన్న ఆన్​లైన్​ షాపింగ్​  షాపింగ్ మాల్స్, బ్రాండెడ్ స్టోర్స్ లోనూ డిస్కౌంట్స్ ఈ కామర్స్ లోనే ఎక్కువగా కొంటున్నట్టు సర్కిల్స్ సంస్థ సర్వే వెల్లడి హైదరాబాద్, వెలుగు:  డిసెంబర్​ వచ్చిందంటే ఇయర్ ఎండ్ సేల్స్ తో సిటీలోని షాపులు కస్టమర్లతో ఫుల్ రష్ కనిపించేవి. ఈసారి కరోనా ఎఫెక్ట్ తో  ఆన్ లైన్ షాపింగ్ చేసేవారు ఎక్కువయ్యారు. బయట మాల్స్ కి వెళ్లి  షాపింగ్ చేస్తున్నవారు ఉన్నారు. దాదాపు అన్ని షాపింగ్ మాల్స్,  షాప్స్​ ముందు ఆఫర్స్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.  50–60శాతం ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్ ఉండడంతో కొనేందుకు కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  బ్రాండెడ్ స్టోర్స్ లో ఆఫర్స్ తో పాటు రేట్లు ఎక్కువగానే ఉంటున్నాయని కస్టమర్లు చెప్తున్నారు. ఆన్ లైన్ లోనూ ఇయర్ ఎండ్ ఆఫర్స్ ఉన్నాయంటున్నారు. ఆన్ లైన్ సైట్స్ లో ఇయర్ ఎండ్ సేల్ పేరుతో 50 శాతం, 90 శాతం ఆఫర్స్ ఇస్తున్నారని చెబుతున్నారు. మింత్రా, అజియో, నైకా, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ–కామర్స్ యాప్స్ మెన్, విమెన్, కిడ్స్ కేటగిరిల్లో నార్మల్ బ్రాండ్స్ నుంచి ఇంటర్నేషనల్ వరకు అన్నింటికి డిస్కౌంట్స్ ఇస్తున్నాయి.  బయటకు వెళ్లి షాపింగ్ చేయడంకంటే ఆన్ లైన్ లో ఆర్డర్ బెటర్ గా ఫీలవుతున్నామని కస్టమర్లు అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది ఆన్ లైన్ సేల్స్ గతేడాదితో పోలిస్తే విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే కస్టమర్ల రద్దీ తగ్గినప్పటికీ సేల్స్ బాగానే ఉన్నాయని వ్యాపారులు చెప్తున్నారు. షాపింగ్ పై సర్వే చేస్తే.. ఇయర్​ఎండింగ్​ఫెస్టివ్ సీజన్ లో కస్టమర్స్ ఎలా షాపింగ్ చేస్తారనే దానిపై లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 50  బిగ్​సిటీస్ లో కండక్ట్ చేసింది.  3 లక్షలకు పైగా కస్టమర్ల నుంచి ఫీడ్​బ్యాక్​ తీసుకుంది. హైదరాబాద్ నుంచి 4,496 మంది ఫెస్టివ్ సీజన్ షాపింగ్ పై ఒపీనియన్​ తెలిపారు. ఇందులో 41శాతం మంది  ఆన్​లైన్​ చేస్తామని చెప్పారు. మరో 29శాతం మంది లోకల్ రీటైల్ స్టోర్స్ నుంచి ఆర్డర్స్ చేసుకుంటామని తెలిపారు. 16 శాతం మంది మాల్స్, మార్కెట్స్, లోకల్ రీటైలర్స్ షాపులకు వెళ్లి షాపింగ్ చేస్తామని వెల్లడించారు. అయితే ఆన్ లైన్ లో  తక్కువ ధరకు నచ్చినవి సెలక్ట్ చేసుకోవచ్చని, ఈజీగా రిటర్న్, రీఫండ్ ఉండడంతో ఎక్కువగా ఇంట్రెస్ట్​ చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. తక్కువకే దొరుకుతున్నయ్ కరోనా ఎఫెక్ట్ తో ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నా. ఇయర్ ఎండ్ ఆఫర్స్ తో బ్రాండెడ్ డ్రెస్​లు తక్కువ ధరకే వస్తున్నయి.  బయట షాప్స్​లో కొన్నింటికి ఫిక్స్డ్ రేట్లు ఉంటుండడంతో, ఆన్ లైన్ షాపింగ్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. – మౌనిక, మాదాపూర్