ఎన్​డీడీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా..ఓయూ వీసీ అడ్డుకుంటున్నడు

ఎన్​డీడీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా..ఓయూ వీసీ  అడ్డుకుంటున్నడు

ఓయూ, వెలుగు: పదవీ విరమణ చేసినా రిటైర్మెంట్ మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా అధికారులు మానసిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ రిటైర్డ్ ప్రొఫెసర్ అన్సారీ సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో శాంతియుత నిరసన దీక్షకు దిగారు. ఆర్ట్స్ కాలేజీలోని లింగ్విస్టిక్ విభాగంలో అన్సారి 20 ఏండ్లు పనిచేశారు.

ఈ ఏడాది జనవరిలో రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి తనకు రావాల్సిన రిటైర్మెంట్ మానిటరీ బెనిఫిట్స్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే అకౌంట్స్ డిపార్ట్​మెంట్​లో నో డిమాండ్ డ్యూస్ సర్టిఫికెట్ (ఎన్​డీడీసీ) ఇవ్వాలి. దీని కోసం ఐదు నెలలుగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ను వేడుకుంటున్నా ఇవ్వట్లేదు. ఈ సర్టిఫికెట్ రాకుండా వైస్ చాన్స్​లర్ ప్రొఫెసర్ రవీందర్ అడ్డుకుంటున్నాడు”అని అన్సారీ ఆరోపించారు. సర్టిఫికెట్ జారీ చేసేదాకా నిరసన దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.