లాక్​డౌన్ పట్టించుకోకుండా పార్టీకి.. బెల్జియం ప్రిన్స్ కి కరోనా

లాక్​డౌన్ పట్టించుకోకుండా పార్టీకి..  బెల్జియం ప్రిన్స్ కి కరోనా

బ్రస్సెల్స్: బెల్జియం ప్రిన్స్ జోచిమ్ కు కరోనా కన్ఫామ్ అయింది. స్పెయిన్​లో ఒక పార్టీకి హాజరైన రెండ్రోజుల తర్వాత ఆయనకు కరోనా సోకినట్లు ఆ దేశ రాయల్ ఫ్యామిలీ ఆదివారం ప్రకటించింది. ఈ నెల 26 న ఇంటర్న్‌షిప్ కోసం స్పెయిన్‌ కు వెళ్లిన ప్రిన్స్ జోచిమ్.. 28న కార్డోబాలో జరిగిన ఓ పార్టీకి అటెండ్ అయ్యారని, ఆ పార్టీలో 27 మంది ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన స్పానిష్ పోలీసులు పార్టీకి హాజరైన వారందరినీ గుర్తించి టెస్టులు నిర్వహిస్తామన్నారు. లాక్​డౌన్ రూల్స్ బ్రేక్ చేసినట్లు రుజువైతే ఒక్కొక్కరికి 10 వేల యూరోలు(రూ.8 లక్షలు) పెనాల్టీ విధిస్తామన్నారు. పార్టీలో ప్రిన్స్ జోచిమ్ తో పాటు, ప్రిన్సెస్ ఆస్ట్రిడ్ చిన్న కొడుకు, కింగ్ ఫిలిప్ సోదరుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్పెయిన్ లో 15 మంది కన్నా ఎక్కువ గుమికూడవద్దన్న లాక్​డౌన్ రూల్స్ అమల్లో ఉన్నదని గుర్తుచేశారు. ఆ దేశంలో ఇప్పటికే 2,39,000 మంది కరోనా బారిన పడగా.. 27,125 మంది మరణించారు. 1,50,000 మంది కోలుకున్నారు.