కెమెరా చూసి నవ్వితే చాలు పేమెంట్‌‌ సక్సెస్

కెమెరా చూసి నవ్వితే చాలు పేమెంట్‌‌ సక్సెస్

బ్యాంక్‌‌, ఏటిఎం ట్రాన్సాక్షన్స్‌‌కు మధ్యవర్తిగా ఉండే సంస్థ మాస్టర్‌‌‌‌ కార్డ్‌‌.. ఈ సంస్థ కొత్త టెక్నాలజీ ప్రవేశ పెట్టబోతోంది. అదే స్మైల్‌‌, హ్యాండ్‌‌ వేవ్‌‌ టెక్నాలజీ. ఇది వరకు డబ్బులు ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేయాలంటే ఏటిఎం కార్డ్‌‌ స్వైప్‌‌ చేసి, పిన్‌‌ కొట్టి లేదా వైఫై కనెక్టివిటీతో ట్యాప్‌‌ చేసి పేమెంట్స్‌‌ చేసేవాళ్లు. ఈ కొత్త టెక్నాలజీలో కార్డ్‌‌ అవసరమే ఉండదు. కెమెరా చూసి నవ్వితే చాలు పేమెంట్‌‌ అయిపోతుంది. అదెలాగంటే.. మాస్టర్ కార్డ్‌‌ వాడే వాళ్లు మాస్టర్‌‌‌‌ కార్డ్‌‌ సైట్‌‌లో రిజిస్టర్ కావాలి. తరువాత పర్సనల్‌‌ డేటా, బ్యాంక్‌‌ డిటెయిల్స్‌‌ ఇచ్చాక ఎఐ (ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌)  సాయంతో ఫేస్‌‌ స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేశాక నవ్వాలి. దాన్నే ట్రాన్సాక్షన్‌‌ లాక్‌‌గా వాడుతుంది. స్మైల్‌‌తోనే కాదు చేతిని అటుఇటు ఊపి కూడా లాక్ పెట్టుకోవచ్చు. ట్రాన్సాక్షన్‌‌ చేసేటప్పుడు అక్కడున్న కెమెరాకు ముఖం చూపించి నవ్వినా, ముఖం చూపించి చేతిని ఊపినా ట్రాన్సాక్షన్ పూర్తయిపోతుంది.