పేటీఎంలో మొబైల్ రీచార్జ్లపై అదనపు చార్జ్

పేటీఎంలో మొబైల్ రీచార్జ్లపై అదనపు చార్జ్

‘ఫోన్ పే’ యాప్ ఇప్పటికే మొబైల్ రీచార్జ్ లపై  ‘ప్లాట్ ఫామ్ ఫీజు’ను వసూలు చేస్తుండగా.. ఇప్పుడా జాబితాలోకి ‘పేటీఎం’ కూడా చేరింది. రూ.100కు మించి మొబైల్ రీచార్జ్ ప్లాన్లపై రూ.1 నుంచి రూ.6 దాకా సేవా రుసుమును వసూలు చేసేందుకు పేటీఎం సిద్ధమైంది. పేటీఎం వ్యాలెట్తో పాటు యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే మొబైల్ రీచార్జ్లకూ ఈ ప్లాట్ ఫామ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పేటీఎం యాప్తో పాటు వెబ్ సైట్ ద్వారా జరిపే రీచార్జ్లకూ ఈ రుసుము వర్తిస్తుంది. ప్లాట్ ఫామ్ ఫీజుకు సంబంధించిన  అప్డేట్ ఇప్పటికే కొందరు పేటీఎం వినియోగదారులకు అందుబాటులోకి రాగా, త్వరలోనే అందరికీ అందనుందని తెలుస్తోంది.  మరోవైపు గూగుల్ పే, అమెజాన్ పే యాప్ల ద్వారా చేసుకునే మొబైల్ రీచార్జ్ లపై ఇంకా ప్లాట్ ఫామ్ ఫీజులు వసూలు చేయడం లేదు. అదనపు రుసుమును చెల్లించొద్దని భావించేవారు,  వాటి ద్వారా మొబైల్ రీచార్జ్లు చేసుకోవచ్చు.